ఎయిడ్స్‌పై ప్రదర్శన ఇస్తున్న కళాకారులు
ప్రజాశక్తి-పద్మనాభం : ఎయిడ్స్ నియంత్రణపై రెడ్డిపల్లి రామాలయ ప్రాంగణంలో కళాబృందాల ద్వారా వీధి నాటకాన్ని మంగళవారం ప్రదర్శించారు.. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ ప్రదర్శన ప్రజలను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫండ్ ఇండియా లింకు వర్కర్స్ స్కీం సభ్యులు ఎం.జ్యోతి, రెడ్డిపల్లి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










