Sep 13,2023 23:40

ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తున్న సీడ్‌ మొబైల్‌ ఐసిటిసి సిబ్బంది

ప్రజాశక్తి- యంత్రాంగం
ఆనందపురం :
ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు చైల్డ్‌ ఫండ్‌ ఇండియా లింక్‌ వర్కర్స్‌ స్కీమ్‌, సీడ్‌ మొబైల్‌ ఐసిటిసి ఆధ్వర్యాన బోని, చిట్టివలస గ్రామంలో ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొబైల్‌ ఐసిటిసి కౌన్సిలర్‌ అర్జున్‌ మాట్లాడుతూ, హెచ్‌ఐవి, ఎయిడ్స్‌పై అవగాహన కల్పిస్తూ గర్భిణులు తప్పనిసరిగా రక్త పరీక్షలు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా 44 మందికి రక్తపరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌టి కిషోర్‌కుమార్‌, లింక్‌ వర్కర్‌ ఎం.జ్యోతి, ఆరోగ్యసిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తగరపువలస : ఎపి ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ఆదేశాలతో చిట్టివలసలో సీడ్‌ మొబైల్‌, ఐసిటిసి ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో హెచ్‌ఐవి/ ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. అనంతరం 44 మందికి రక్త పరీక్షలు చేశారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ కిషోర్‌కుమార్‌, లింక్‌ వర్కర్‌ జ్యోతి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు