Dec 04,2022 15:45

ప్రజాశక్తి-రాంబిల్లి : శ్రీకాకుళం జిల్లా మంత్రి నివాసములో కలవటం జరిగింది. శువర్ధిక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖమాత్యులు సీదిరి అప్పలరాజు, నేవీ JAC పెద్దలు పలాస మంత్రి కార్యాలయంలో కలవడం జరిగింది. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరగా దీనికి మంత్రి అనకాపల్లి జిల్లా కలెక్టర్ తో ఫోన్లో నేవీ సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పడం జరిగింది. ఈ రోజు రాత్రికి మత్స్యశాఖా కమిషనర్ కన్నబాబుతో మరియు అనకాపల్లి జిల్లా కలెక్టర్ తో పాటు JAC నాయకులతో మంత్రి కాన్ఫరెన్స్ ద్వారా చర్చించి న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది.