ప్రజాశక్తి - చిప్పగిరి
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ వారైనా ఎవరితో ఎవరు జతకట్టినా గెలిచేది మాత్రం వైసిపి అని జడ్‌పిటిసి విరుపాక్షి, ఎంపిపి భర్త, వైసిపి యువ నాయకులు జూటూరు మారయ్య తెలిపారు. బుధవారం నేమకల్లు గ్రామంలో జరిగిన తలారి భూపేష్ వివాహ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయి వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టిడిపి సొంత బలం లేక ముందుకొచ్చిన పార్టీల వారితో జతకట్టడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ప్రజలు ఎవరు మంచి చేస్తారో, ఎవరు కుయుక్తులు, కుతంత్రాలతో రాజకీయాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్‌ను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎంపిటిసిలు బుడ్డ సుంకన్న, భీమలింగ, మాజీ ఎంపిటిసి మల్లికార్జున, వాల్మీకి మండల అధ్యక్షులు లోకనాథ్, వైసిపి నాయకులు లాలూ స్వామి, పద్మనాభ రెడ్డి, మోహన్, గురుదాసు, హనుమంతు, మల్లికార్జున పాల్గొన్నారు.
నేమకల్లులో వివాహ వేడుకలో పాల్గొన్న జడ్‌పిటిసి విరుపాక్షి, జూటూరు మారయ్య










