అందరిదీ అయ్యుండొచ్చు
ఎవరి కాలం వారిదే
జీవితమైనా అంతే
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా
కార్య కారణంతోనే క్రియ
బతుకొక నిర్బంధ ప్రక్రియ
అలల కనురెెప్పల కింద
ఎన్ని రహస్య చిత్రాలో
జీవితం ఎంత పెద్దదో
అంత చిన్నది
ఎంత చిన్నదో అంత పెద్దది
పంచ భూతాలూ
నీతో ఉన్నంత కాలమో లేదా
వాటితో నువ్వు జతకట్టిన కాలమో
లిఖించుకోవాల్సినది అక్కడే
నీటి మీద రాతలుగానే ఎందరో..
కాలం గొప్ప ఎక్సరే
లొంగని తనమేదీ లేదు
రెండుతీరాల ఎటో వైపు
నీదైన సరిహద్దు వైపు
వంగి తీరాలి
కాలానికి గేలం వేస్తే
అంతుచిక్కని గాథలెన్నో
ఎన్ని అలల్ని చూడలేదు?
ఎన్ని వలల్ని చూడలేదు
మరెన్ని కలల్ని కనలేదూ
కొన్ని కలలు కొన్ని కన్నీళ్లు
కొన్ని వలలు కొన్ని అలలు
శిఖా ఆకాష్
93815 22247