Nov 18,2023 00:05

ప్రజాశక్తి - బల్లికురవ రూరల్
జగనన్న భూహకు పత్రం పట్టాదార్ పాస్ పుస్తకం పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. గత కొంతకాలం నుండి మండలంలోని కూకట్లపల్లి ఎస్సీ, ఎస్టీలు గతంలో ప్రభుత్వం తమకు ఇచ్చిన డీకే అసైన్మెంట్ భూములకు రీ సర్వేలో నమోదు చేసి కొత్తగా ప్రభుత్వం జారీ చేస్తున్న వైఎస్‌ఆర్ జగనన్న శాశ్విత భూహక్కు, భూ రక్ష పథకం ద్వారా పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్నది. అందులో భాగంగా మండలంలోని కూకట్లపల్లి గ్రామం ఫస్ట్ ఫేస్‌లో ఉండడం వల్ల రీ సర్వే పూర్తి చేశారు. గత మే నెల నుండి ఆ గ్రామం ఎస్టీలు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వాలని అనేక మార్లు అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. గతవారం సిపిఎం ఆధ్వర్యంలో ఆ గ్రామం ఎస్‌సి, ఎస్టిలు తహశీల్దారు ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించారు. జగనన్న భూ హక్కు పత్రం, పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని ఆందోళన చేశారు. సమస్య పరిష్కరించలేకపోతే మరల ఆందోళన చేపడతామని తహశీల్దారు రవిబాబు దృష్టికి తీసుకెళ్లారు. తహశీల్దారు ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం విఆర్‌ఒ వెంకటేశ్వర్లు ద్వారా సంఘంలోని ఎస్టీలు 40మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు, గొల్లపూడి అంజయ్య, కూకట్లపల్లి శాఖ కార్యదర్శి పి రమణయ్య, సభ్యులు పి శ్రీను, కాలనీవాసులు పాల్గొన్నారు.