Dec 27,2022 23:58

రోడ్డు, వంతెన నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి- కూనవరం
మండలంలోని గండికొత్త గూడెం గ్రామంలో మూడు సంవత్సరాలుగా బిల్లులు రాకుండా నిలిచిపోయిన రోడ్డు, వంతెన పనులు పున:ప్రారంభమయ్యాయి. ఈ పనులు పూర్తి చేయాలని సిపిఎం ఆధ్వర్యాన గ్రామస్తులు చేసిన పోరాటాలకు ఫలితంగా అధికారులు స్పందించి వెంటనే పనులు పనులు ప్రారంభిచాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. దీంతో మంగళవారం పనులను ప్రారంభించారు. మూడు సంవత్సరాల నుండి గ్రామస్తులు నిత్యావసరాలకు, హాస్పిటల్‌లకు, మండల కేంద్రానికి రావాలంటే ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు పనులు ప్రారంభం కావడం పట్ల గ్రామస్తులు ఆనందంగా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మడకం నాగమణి, సిపిఎం నాయకులు పాయం సీతారామయ్య, మేకల నాగేశ్వరావు, బాబు బొర్రయ్య, వైస్‌ ఎంపీపీ కొమరం పెంటయ్య, పాయం సత్యనారాయణ, పొడియం రామారావు, కన్నయ్య, భద్రయ్య, ఇంజనీరింగ్‌ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.