ప్రజాశక్తి- ఆనందపురం : మండలంలోని బోని గ్రామంలో జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ విశ్వనాధన్, వ్యవసాయ అధికారులు పర్యటించారు. బోని గ్రామంలో 15 రోజుల క్రితమే కోతలు కోసి అమ్మడానికి సిద్ధంగా ఉన్న ధాన్యం కల్లాలో కుప్పలు పోసుకొని రైతులు ఎదురుచూస్తున్నారు. తుపాన్ కారణంగా ధాన్యం కల్లాల్లో ఉండిపోవడంపై పత్రికల్లో వచ్చిన కథనాలపై కలెక్టర్ స్పందించారు. బోని గ్రామాన్ని సందర్శించారు. ధాన్యాన్ని పరిశీలించారు. రైతు భరోసా కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టారు. 800 టన్నులు ధాన్యాన్ని ఆనందపురం సహకార బ్యాంక్ వారు ఆర్‌బికె ద్వారాకొనుగోలు చేసినట్లు వ్యవసాయ అధికారి సంధ్యా రత్నప్రభ తెలిపారు. రైతు భరోసా కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి ఉద్యోగుల పని తీరును, డిజిటల్ కెవైసిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కె.అప్పలస్వామి, సివిల సప్లై జిల్లా మేనేజర్ రాజేశ్వరి, సహాయ వ్యవసాయ సంచాలకులు బి.విజయప్రసాద్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోని అప్పలనాయుడు, సర్పంచ్ బోని అప్పలకొండ, సన్యాసినాయుడు, గ్రామ వ్యవసాయ సహాయకులు జి.దిలీప్ చక్రవర్తి పాల్గొన్నారు.










