
జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం ఎట్టకేలకు ఖరారైంది. శుక్రవారం ఆయా కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టరేట్లలో సమావేశాలను నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులకు ఆహ్వానాల్ని అందజేశారు. 2023-24 ఖరీఫ్ సీజన్ ముగింపు దశలో సాగునీటి సలహా మండలి సమావేశాలు నిర్వహించడంపై చర్చనీయాంశంగా మా రింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం, వర్షాభావ పరిస్థితులు తలెత్తిన నేప థ్యంలో మధ్యలో గానీ ఆయా ప్రాజెక్టుల ఆయకట్టు సాగు ఎంత, ప్రాజెక్టుల్లో నీటి నిల్వల పరిమాణం ఎంత, ఎంత నీటిని, ఎప్పుడు విడుదల చేయాలనే అంశాలపై చర్చించడం సమంజసంగా ఉంటుంది. ఖరీఫ్ సీజన్ ముగింపు దశలో సమావేశాలు నిర్వహించడంలోని ఉద్దేశమేమిటో తెలియడం లేదు. సమావేశాలు నిర్వహిస్తే ప్రజాప్రయోజనం లభించే అవ కాశం ఉంది. సీజన్ ముగింపు దశలో కెసి కెనాల్, బ్రహ్మసాగర్, మైల వరం, వెలిగల్లు రిజర్వాయర్ల పరిధిలోని సుమారు 2.15 లక్షల నుంచి 2. 50 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారిన సమయంలో సమావేశాలు నిర్వహించడంలో అర్థ మేమిటో తెలియడం లేదు. ప్రజాశక్తి - కడప ప్రతినిధి
ఉమ్మడి జిల్లాలో 15 సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. కెసి కెనాల్, బ్రహ్మసాగర్, మైలవరం, చిత్రావతి, పిబిసి వెలిగల్లు రిజర్వాయర్లు ఆయకట్టు ప్రాణాధారితాలు. చిత్రావతి, పైడిపాలెం రిజర్వాయర్లు మినహా మిగిలిన ప్రాజ ెక్టుల ఆయ కట్టుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ ంటు న్నారు. కెసి కెనాల్, బ్రహ్మసాగర్, మైలవరం, వెలిగల్లు రిజ ర్వాయర్ల ఆయకట్టు దారులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఆయా ప్రాజెక్టుల కింద సుమారు రెండు లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు బీళ్లుగా దర్శన మిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఆయకట్టు రైతుల్లో అయోమయం
శ్రీశైలం, తుంగభద్ర జలాశయాల నుంచి సాగునీరు విడుదలకు నోచని నేపథ్యంలో జిల్లాలోని ఆయ కట్టుదారుల్లో అయోమయం నెలకొంది. ప్రభుత్వం ప్రతిఏటా ఆగష్టు మూడో వారంలో 16, 17 తేదీల్లో కెసి కెనాల్ ఆయకట్టు, బ్రహ్మసాగర్ ఆయకట్టు ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేయడం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ మూడోవారం గడుస్తున్నప్పటికీ శ్రీశైలం, తుంగభద్ర జలాశ యాల్లో నీటి నిల్వల పరిమాణం పెరగలేదనే కారణంతో సాగు నీటిని విడుదల చేయకపోవడం గమనార్హం. ఫలితంగా కెసి కెనాల్ కింద 92 వేల ఎకరాలు, బ్రహ్మసాగర్ కింద 1.05 ఎకరాల్లో 70 వేల ఎకరాలు, మైలవరం కింద 24 వేల ఎకరాలు వెరసి 2.15 లక్షల నుంచి 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు బీడుగా దర్శనమిస్తోంది.
కాల్వలకు మరమ్మతులేవీ?
జిల్లాకు కెసి కెనాల్ ఆయకట్టు ప్రాణాధారితం. ప్రతిఏటా చివరి ఆయకట్టుకు నీరందించాలంటే తలకు మించిన భారం గా మారుతోంది. కాల్వల అక్కడక్కడా మరమ్మతులకు గురవడం, లస్కర్ల కొరత తీవ్రంగా వేధిస్తుండడం, ఏపుగా పెరిగిన జమ్ము, ఇతర వ్యర్థాల కారణంగా సాగుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మైల వరం కుడి, ఎడమ కాల్వలు తరుచుగా మరమ్మతులకు గురవ డం, ఓ కాల్వలో అడవిని తలపించే కంప చెట్లతో కలిసి జమ్ము ఏపుగా పెరగడం పరిపాటిగా మారింది. అన్నమయ్య జిల్లా లోని వెలిగల్లు రిజర్వాయర్ ప్రధానకాల్వలు, డిస్ట్రిబ్యూటరీల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటుడడం తెలిసిందే. డిస్ట్రి బ్యూటరీలు, ఫీడర్ ఛానళ్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయని కారణంగా చివరి ఆయకట్టు వరకు నీటిని అందించడం సాధ్యం కావడం లేదు. అన్నమయ్య, పింఛా, జలాశయాలు గల్లంతైన నేపథ్యం వంటి సమస్యలతో వ్యవసాయ, నీటి పారుదల శాఖలు కునారిల్లు తుండడం ఆందోళన కలిగిస్తోంది.