ప్రజాశక్తి - పెద్దాపురం మండల పరిధిలోని ఏటిపట్టు గ్రామాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రజా రక్షణ భేరి యాత్రలో సిపిఎం నాయకులు విమర్శించారు. శుక్రవారం 3వ రోజు యాత్ర జి.రాగంపేట, వడ్లమూరు, గోరింట, పులిమేరు, దివిలి, చంద్రమాంపల్లి, తాటిపర్తి, చదలాడ, తిరుపతి, మర్లావ, కాండ్రకోట, గుడివాడ, సిరివాడ గ్రామాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో బెల్లం తయారీ కేంద్రాలు, జగనన్న కాలనీలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతుంటే వ్యతిరేకించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మరిన్ని భారాలు వేస్తోందన్నారు. ఈ జాతాలో సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు, రూరల్ కార్యదర్శి కేదారి నాగు, నాయకులు గరగపాటి పెంటయ్య, దారపురెడ్డి సత్యనారాయణ, కూనిరెడ్డి అప్పన్న, లెక్కల నరసింహమూర్తి, దారపురెడ్డి కృష్ణ, సిరపరపు శ్రీనివాస్, మంతెన సత్తిబాబు, మరిడియ్య, యాసలపు రమేష్, జగదీష్, క్రాంతి కుమార్ పాల్గొన్నారు.