Aug 13,2023 21:11

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న సిఐ సురేష్‌కుమార్‌

కలికిరి : ఎటిఎం సెంటర్ల దగ్గర డబ్బులు కాజేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వాల్మీకిపురం సిఐ పి.సురేష్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సిఐ మాట్లాడుతూ నాలుగు రోజులు క్రితం కలికిరి క్రాస్‌రోడ్‌ ఎటిఎం వద్ద ఇద్దరు వద్ధులు డబ్బులు తీసుకుంటున్న సమయంలో సదుం మండలం బత్తలవారిపల్లి కు చెందిన ఆటో డ్రైవర్‌ చింతల మోహన్‌(28) వారిని ఏమార్చి వారి దగ్గర నుండి ఎటిఎం దొంగిలించి వారి అకౌంట్లో ఉన్న నగదును తీసేవాడని చెప్పారు. బాధితులు కలికిరి పోలీస్‌ స్టేషన్‌ ఆశ్రయించగా ఎస్‌ఐ రహిమల్ల ఆదేశాల మేరకు ఏఎస్‌ఐ మధుసూదనాచారి కేసు నమోదు చేశారని చెప్పారు. తమ సిబ్బందితో కలికిరిలో తనిఖీ నిర్వహిస్తుండగా శనివారం మధ్యా హ్నం కలకడ రోడ్డు లోని సాయిబాలాజీ కాలనీ సమీపంలో ఆటోలో అను మానంగా ఉన్న వ్యక్తిని విచారించగా నిందితుడిగా తేలడంతో అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి రూ.42 వేల రూపాయలు నగదు, ఆంధ్ర బ్యాంక్‌ ఎటిఎం కార్డు, ఒక కీప్యాడ్‌, లావా ఫోను, వెండిచైన్లు రెండు బ్రాస్లెట్‌ రెండు, వెండి ఉంగరము, బంగారు చెవి పోగులు ఒక జత తో పాటు ఆటోను స్వాధీనం చేసుకుని, అరెస్టు చేసినట్లు తెలిపారు. దొంగతనాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎలాంటి అను మానం ఉన్న పోలీసులు తెలపాలన్నారు. కార్యక్రమంలో ఎఎస్‌ఐ మధుసూదనాచారి, హెడ్‌ కానిస్టేబుల్‌ మనోహర, మహమ్మద్‌ అలీ, పిసిలు మునిరత్నం, అమర్‌నాథ్‌లు పాల్గొన్నారు.