Oct 31,2023 20:42

డయేరియా గురించి సిబ్బందితో చర్చిస్తున్న గేదెల రాజారావు

ప్రజాశక్తి - నెల్లిమర్ల : ఏటి అగ్రహారంలో డయేరియా ప్రబలింది. గత మూడు రోజులుగా గ్రామస్తులు వాంతులు విరోచనాలతో భాద పడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 30 మంది డయేరియాతో స్థానిక సిహెచ్‌సి, మిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా గ్రామంలో పారిశుధ్యం లోపించినట్లు తెలిసింది. కాలువలు మురుగు, చెత్తతో నిండిపోయి దర్శనమిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా వైద్య సిబ్బంది తనిఖీలు చేసి సేవలు అందిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. డయేరియా ప్రబలి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికార్లు ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఆందోళన చెందుతున్నారు. డయేరియా పై టిడిపి జిల్లా అధికార ప్రతినిధి, దన్నాన పేట మాజీ సర్పంచ్‌ గేదెల రాజారావు రామతీర్థం సచివాలయంలో వైద్యాదికార్లతో మాట్లాడి తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి డయేరియా నియంత్రించాలని డిమాండ్‌ చేశారు.