
ప్రజాశక్తి-విజయవాడ : ఇఎస్‌ఐ కుంభకోణం కేసులో ఎసిబి అధికారులు బుధవారం నలుగురిని అరెస్టు చేశారు. విజయవాడలో ఇఎస్‌ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ బాలరవికుమార్, ఓమ్ని మెడి, ఓమ్ని ఎంటర్‌ప్రైజెస్ యజమాని కంచర్ల శ్రీహరి, ఓమ్ని హెల్త్‌కేర్ యజమాని కంచర్ల సుజాత, మేనేజర్ బండి వెంకటేశ్వర్లు అరెస్టయిన వారిలో ఉన్నారు. వైద్య పరికరాలు, మెడికల్ కిట్లను 50 నుంచి 400 శాతం అధిక ధరలకు విక్రయించారని, ఖజానాకు రూ.35 కోట్ల మేర నష్టం కల్పించారని ఎసిబి నిర్ధారించింది. అరెస్టయిన వారిని కోర్టులో హాజపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారు.