ఎస్విసీఈలో జాతీయ సదస్సు
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)
తిరుపతి-కరకంబాడి మార్గంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ' డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ', ఎస్విసిఈ సంయుక్త ఆధ్వర్యంలో ' మెకానికల్- ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోసం సంకలిత తయారీలో( ఆడిటివ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్) పురోగతి అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. సుధాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం ప్రారంభమైన జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా ఐఐటి ఖరగ్పూర్ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ వి. వాసుదేవరావు, రిసోర్స్ పర్సన్ గా డిఆర్డిఓ బెంగళూరు జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి.రామ్ ప్రభు, అమరరాజా బ్యాటరీస్ అసిస్టెంట్ మేనేజర్ డాక్టర్ డి. శ్రీధర్ నాయుడు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగపు ప్రొఫెసర్ డాక్టర్ పి. వెంకటరామయ్య పాల్గొని విద్యార్థులకు ఆడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంశాన్ని వివరించారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎం. చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ అండ్‌డిహెచ్ డాక్టర్ సి.చంద్రశేఖర్ పాల్గొన్నారు.










