ఎస్విసీఈలో ఆర్చరీ పోటీల ఎంపికలు
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)
తిరుపతి-కరకంబాడి మార్గంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో జేఎన్టీయూ పరిధిలోని అంతర్ కళాశాలల ఆర్చరీ పోటీ ఎంపికలను శుక్రవారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి జేఎన్టీయూ స్పోర్ట్స్ సెక్రటరీ జాజిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. సుధాకర్ రెడ్డి, చిత్తూరు జిల్లా ఆర్చరీ కోచ్ ధనుంజయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంతర్ కళాశాలల విద్యార్థులు కొందరు ఉత్తమ ప్రతిభ కనబరిచి అర్హత సాధించారన్నారు. విద్యార్థులు ఇటువంటి అంతర్ కళాశాలల పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి జీవిత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షింస్తున్నామని ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్లు చెన్నయ్య, పార్వతి, విజయలక్ష్మి, మోహన్ బాబు తదతరులు పాల్గొన్నారు.










