Sep 22,2023 22:47

ఎస్వీయూతో సుజన్‌ లైఫ్‌ సైన్సెస్‌ సహకార ఒప్పందం

ఎస్వీయూతో సుజన్‌ లైఫ్‌ సైన్సెస్‌ సహకార ఒప్పందం
ప్రజాశక్తి - క్యాంపస్‌ : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంతో సుజన్‌ లైఫ్‌ సైన్స్‌ సంస్థ శుక్రవారం పరస్పర అంగీకార ఒప్పందం చేసుకుంది. ఎస్వీయూ ఉపకులపతి ఆచార్య కె.రాజారెడ్డి, సుజన్‌ లైఫ్‌ సైన్స్‌ వ్యవస్థాపకుడు డా. దామోదరరెడ్డి లు పరస్పర అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. ఎం ఓ యు ప్రకారం రెండు సంస్థలు లైఫ్‌ సైన్స్‌ రంగంలో సేఫ్టీ డ్రగ్‌ టెస్టింగ్‌, డ్రగ్‌ డిస్కవరీ రీసెర్చ్‌ , ఫార్మాసూటికల్స్‌, బయోటెక్నాలజీ, యనిమల్‌ మోడల్‌ డిసీజస్‌, స్టూడెంట్‌ రీసెర్చ్‌ వంటి అంశాలపై రెండు సంస్థలు పరస్పరం సహకారం అందించుకుంటాయని విసి అన్నారు. ఎస్వీయూ పూర్వ విద్యార్థి అయిన సుజన్‌ లైఫ్‌ సైన్స్‌ సంస్థ యజమాని యన్‌ ఆర్‌ ఐ గా 35 సంవత్సరాల ఫార్మారంగ అనుభవాన్ని కలిగివున్నారని , 2006 లో తిరుపతిలో స్థాపించిన సంస్థతో ఒప్పందం లైఫ్‌ సైన్స్‌ లో మరిన్ని పరిశోధనా సౌక ర్యాలను అందిస్తుందని ఉపకులపతి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీయూ రిజిస్ట్రార్‌ ఆచార్య మహమ్మద్‌ హుస్సేన్‌ , డీన్లు ఆచార్య అప్పారావు, ఆచార్య తులసీ రామకష్ణారెడ్డి, ఆచార్య ఎస్‌. విజయభాస్కరరావు , ఆచార్య కిషోర్‌ పాల్గొన్నారు.