ఎస్వీయూలో సివిల్ సర్వీస్‌కు ఆంత్రోఫాలజీ కోర్సు ఉపయోగకరం విభాగాధిపతి ఆచార్య కె సురేంద్రనాథ్ రెడ్డి
ఎస్వీయూలో సివిల్ సర్వీస్‌కు ఆంత్రోఫాలజీ కోర్సు ఉపయోగకరం
విభాగాధిపతి
ఆచార్య కె సురేంద్రనాథ్ రెడ్డి
ప్రజాశక్తి - క్యాంపస్ : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఆంత్రోఫాలజీ కోర్సుతో విద్యార్థులకు సివిల్ సర్వీస్ లో ఆంత్రోఫాలజీ సబ్జెక్టును ప్రత్యేకమైన సబ్జెక్టుగా తీసుకుని విజయం సాధించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని విభాగాధిపతి ఆచార్య కె. సురేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ఈ కోర్సులో ఎస్వీ యూనివర్సిటీలో సీటు సాధించవచ్చన్నారు. ఎస్వీయూలోని ఆంత్రోఫాలజీ విభాగంలో కన్వీనర్ కోటా కింద 40 సీట్లు ఉన్నాయని, మేనేజ్మెంట్ కోటా కింద మూడు సీట్లు ఉన్నాయన్నారు. ఈ కోర్సులో చేరాలనుకునే ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏపీ పీజీ సెట్ 2023 సంవత్సరంలో అర్హత పరీక్ష లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆంత్రోఫాలజీ విభాగంలో చేరే అవకాశం ఉంటుందన్నారు. ఆంత్రోఫాలజీ విభాగానికి ప్రత్యేక మైన గ్రంథాలయ సౌకర్యం ఉందని, మానవ శిలాజాలకు సంబంధిం చిన పుట్టుపూర్వోత్తరా లు విశదీకరించే మ్యూజియం, ఇతర లాబొరేటరీ సౌకర్యాలు అత్యంత అధునాతనంగా రూపుదిద్దు కొన్నాయన్నారు. జాతీయస్థాయిలో నిర్వహించే అఖిల భారత సర్వీసులైన యూపీఎస్సీ పరీక్షలకు సంబంధించి ప్రత్యేకమైన సబ్జెక్టుగా ఆంధ్రప్రదేశ్ సబ్జెక్టు విద్యార్థులు ఎన్నుకోవడం జరుగుతుం దన్నారు. ముఖ్యంగా ఆంత్రోఫాలజీ సబ్జెక్టు ఎలాంటి విద్యార్థులకు యూపీఎస్సీ లో ఎలాంటి కన్ఫ్యూషన్ కు తావుఇవ్వకుండా క్రమ పద్ధతిగా అర్థవంతంగా ఉన్నతమైన మార్గాలు సాధించడానికి ఎంతో ఉపపడుతోంది అన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే యుజిసి నెట్, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఏపీ సెట్, రాష్ట్రస్థాయిలో పరీక్షలైన గ్రూప్ 1,2, సచివాలయం, డిగ్రీ కళాశాలలోని, ఇతర పోటీ పరీక్షలకు ఆంత్రోఫాలజీ సబ్జెక్టు సంబంధించిన అంశాలు ఎన్నో వస్తున్నట్లు వెల్లడించారు. ఆంత్రోఫాలజీలో పీజీ చేసిన విద్యార్థులకు పరిశోధన రంగంలోనూ, ఆంత్రోఫాలజీకల్ సర్వే ఆఫ్ ఇండియా, జాతీయ ఆహార సంస్థ వంటి అనేక సంస్థలు పేరుగాంచిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో పాటు ఎన్జీవో సంస్థలలో ఉద్యోగావ కాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఉదాహరణకు డబ్ల్యూహెచ్ ఓ, బిల్ గేట్స్ ఫౌండేషన్, జిల్లా స్థాయిలలో ఐటీడీఏ, ఐసిడిఎస్, డిఆర్డిఏ వంటి ప్రభుత్వ రంగ శాఖలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వెల్లడిం చారు. మానవ శాస్త్ర విభాగానికి సంబంధించి ఎస్‌ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో మ్యూజియం క్యూరేటరుగా, రాష్ట్ర స్థాయి, జిల్లాస్థాయి మ్యూజియం క్యూరేటరుగా ఉద్యోగానికి అర్హులని వివరించారు. దేశ, విదేశాలలో కూడా ఎన్నో విశ్వ విద్యాలయాలలో ఆంత్రో ఫాలజీ పీజీ కోర్సు చేసిన విద్యార్థులకు ఎన్నో అద్భుతమైన అవకాశాలు కల్పిస్తున్నా యన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఏపీపీజీ సెట్ 2023 పరీక్షల్లో ఉత్తీర్ణులు సాధించిన విద్యార్థులు ఎస్వీయూలో ఆంత్రోఫాలజీ కోర్సులో చేరేందుకు అర్హులన్నారు. అంతే కాకుండా జువాలజీ పరీక్ష రాసిన విద్యార్థులు కూడా ఎస్వియూ ఆంత్రోఫాలజీ కోర్సులో చేరేందుకు అవకాశం ఉంద న్నారు. విద్యార్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా రాణించేందుకు ఆంత్రోఫాలజీ విభాగం అధ్యాపకులు, పరిశోధకులు ఎల్లప్పుడూ తమ తోడ్పాటు సహాయ, సహకారాలను అందిస్తారన్నారు.










