ఎస్వీ గోశాలలో రూ.46 కోట్లతో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్
తిరుమల : దేశవాళీ గో జాతుల అభివద్ధికి, జన్యుపరమైన సామర్థ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో తిరుపతిలోని ఎస్వీ గోసంరక్షణ శాలలో జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు, టీటీడీ సంయుక్తంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేస్తోందని ఈవో ఎవి ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం తిరుమలలో తన కార్యాలయంలో ఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ మత్స్య, పశుసంవర్ధక శాఖలు గోవుల జన్యు పరిరక్షణ కోసం రూ.46 కోట్లు నిధులు మంజూరు చేశారన్నారు. ప్రతి రోజూ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి అన్ని సేవలకు 60-100 కిలోల నెయ్యి, మూడు వేల లీటర్లు పాలు దేశవాళీ గో జాతుల నుండి ఉత్పత్తి చేయడానికి దేశావళి గోవులను అభివద్ధి చేయడమే లక్ష్యంగా టీటీడీ పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎన్‌డీబీ, ఎన్‌డీఎస్‌లు సమన్వయం చేసుకుని ప్రాజెక్టులోని అన్ని భాగాలు విడుదల అయిన నిధుల ద్వారా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో శ్రీజా మహిళా మిల్క్ ప్రొడ్యుసర్ ఛైర్‌పర్సన్ శ్రీదేవి, ఎన్‌డిడిబి ఎండి డా. దేవానంద్, జేఈవో సదా భార్గవి, ఎఫ్‌ఎ అండ్ సిఎవో బాలాజి, సిఇ నాగేశ్వర్ రావు, గో శాల డైరెక్టర్ హరనాథ రెడ్డి, ఎస్వీ పశు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు డా.సర్జన్‌రావు, డా. వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు.
అధికారులతో ఈవో సమీక్ష










