Apr 22,2023 19:29

ఆదోనిలో గోడపత్రికను విడుదల చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
పార్లమెంట్‌లో వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందే వరకు విఆర్‌పిఎస్‌ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర అధ్యక్షులు సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. శనివారం పట్టణంలోని వాల్మీకి కార్యాలయంలో నాయకులతో కలిసి 'మే 31న చలో ఢిల్లీ' గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తూ గత మార్చి 24న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫారసు చేసిందనందుకు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద వాల్మీకుల సంకల్ప దీక్ష చేపడుతున్నామని చెప్పారు. వాల్మీకులు పార్టీలకతీతంగా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సీనియర్‌ జర్నలిస్టు వెంకన్న, విఆర్‌పిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభీమ్‌ నాయుడు, వాల్మీకి సంఘం నాయకులు బి.దేవా, సుధాకర్‌, కిశోర్‌, బిటి.లక్ష్మన్న, దస్తగిరి నాయుడు, పవన్‌, సోము పాల్గొన్నారు. దేవనకొండలో విఆర్‌పిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు సుభాష్‌ చంద్రబోస్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు కప్పట్రాళ్ల మల్లికార్జున ఆధ్వర్యంలో చలో ఢిల్లీ వాల్మీకుల సంకల్ప దీక్ష కరపత్రాలు విడుదల చేశారు. వాల్మీకి నాయకులు రాజన్న, రామాంజనేయులు, రాముడు, రాజు, రాజశేఖర్‌, జనార్ధన్‌, మధు, తిరుమలేష్‌, వాల్మీకులు పాల్గొన్నారు.