Oct 08,2023 21:01

గర్జన సభలో నినాదాలు చేస్తున్న వాల్మీకులు

మదనపల్లె అర్బన్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వాల్మీకులు ఎస్‌టి పునరుద్ధరణ జరిగే వరకు జాతి ఫస్ట్‌, పార్టీ నెక్స్ట్‌ అనే నినాదంతో పోరాటం చేయాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్‌ వ్యవస్థాపకులు పులి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆదివారం తంబళ్లపల్లి నియోజకవర్గం గ్రూపులకోట మం డలం దొమ్మన్న బావి వద్ద వాల్మీకి గర్జన సభను నిర్వ హించారు. సభకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పార్టీలకు సంఘాలకు అతీతంగా వాల్మీకి సంఘం నాయకులు ప్రజలు హాజరయ్యారు. సమావేశంలో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్‌ వ్యవస్థాపకులు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ వాల్మీకుల చిరకాల వాంఛ ఎస్‌టి సాధనకు దశాబ్దాల తరబడి సంఘం నాయకులు పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల ముందు వాల్మీకులు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయం పట్టించుకోకుండా రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు. దీనికి కారణం వాల్మీకుల్లో వర్గాలు సష్టించి మనలో ఐకమత్యాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. కేవలం వాల్మీకులను ఓటు బ్యాంకుగానే రాజకీయ పార్టీలు చూస్తు న్నాయన్నారు. వాల్మీకులను ఎస్‌టి పునరుద్ధరణకు సహకరించని పార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అందుకోసం వాల్మీకుల్లో చైతన్యం తీసుకురావాల్సిన ఆవశ్యకతను వివరించారు. ముందుగా విద్యార్థులు, యువత వాల్మీకుల ఎస్‌టి పునరుద్ధరణ పోరాటంలో ముందుకు రావాలని కోరారు. అప్పుడే మనం అనుకున్నది జరుగు తుందన్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాల్మీకి సంఘం నాయకులు వెంకటేష్‌ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో వాల్మీకులు జాతి ఫస్ట్‌.. పార్టీ నెక్స్ట్‌ అనే నినాదంతో వాల్మీకుల ఎస్టి పునరుద్ధరణ ఉద్య మంలో ముందుకు రావాలన్నారు. పోరాటాలు చేస్తేనే ప్రభుత్వాలు దిగివచ్చి ఎస్టి పునరుద్ధరణకు సహకరిస్తాయన్నారు. ఆంధ్రాలోని వాల్మీకి సోదర ులకు కర్ణాటక రాష్ట్రంలోని వాల్మీకిసోదరులంతా మద్దతుగా ఉంటారని హామీ ఇచ్చారు. కార్యక్ర మంలో వాల్మీకి గర్జన సభ నిర్వహణ కమిటీ సభ్యులు యనమల నారాయణ, కుప్పం సురేష్‌, రమణ, కొండయ్య గారి చంద్రశేఖర్‌, లక్ష్మీన ారాయణ, అనిల్‌, రాము, హరి, మనోహర, వెంక టరమణ అదేవిధంగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్‌ సంఘం నాయకులు సద్దల జయసింహ, వలసల మంజు, మద్దయ్య గారి వెంకటరమణ పాల్గొన్నారు.