Oct 29,2023 22:46

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) కె.కొత్తపాలెం ఎస్టీ మహిళలకు తక్షణం రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) ఆధ్వర్యంలో స్థానిక జ్యోతిరావు పూలే విజ్ఞాన్‌ కేంద్రంలో ఆదివారం కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ రాజేష్‌ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ముఖ్య వక్తగా పాల్గొన్న ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి మాట్లాడుతూ ఘటన జరిగి వారం రోజులు కావస్తున్న ఇంతవరకు ఎఫ్‌ఐఆర్‌ కాపీని ఇవ్వలేదన్నారు. బాధితులను హింసించిన మత్తి రాజా చంద్‌ తోపాటు అతని చెల్లెలు రాధిక, మోపిదేవి ఎస్సై, సచివాలయ మహిళ సంరక్షణ అధికారి స్రవంతి పై కూడా కేసు పెట్టి బాధ్యులుగా చేర్చాలని డిమాండ్‌ చేశారు. బాధితులను హింసించిన మద్దిరాజపై ఛార్జ్‌ షీట్‌ పోలీసులు బలంగా వెయ్యని కారణంగానే బెయిల్‌ దొరికిందని బెయిల్‌ రాకుండా జిల్లా కోర్టులో బలమైన చారి షీట్ను వెయ్యాలన్నారు. బాధిత మహిళలకు సాయంగా ఎనిమిది లక్షలు రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేసును పోలీసుల విచారణలో కాకుండా కోర్టు పర్యవేక్షణలో జరగాలన్నారు బాధితులకు తక్షణం రక్షణ కల్పించాలని, పునరావాసం కల్పించాలని, రాచూరి దుర్గాదేవికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సాక్ష్యాలు వీడియో, ఆడియో రూపంలో నమోదు చేయాలన్నారు. తక్షణ సాయాన్ని ఇంతవరకు కూడా అందించలేదని వెంటనే బాధితులకు అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో జిల్లా కార్యదర్శి వి. జ్యోతి, అధ్యక్షులు బసవపూర్ణ,, ఐసీఈయు జనరల్‌ సెక్రెటరీ జి.కిషోర్‌ కుమార్‌, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ రవిబాబు, శ్రామిక మహిళా కన్వీనర్‌ ధనశ్రీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చంద్రశేఖర్‌, న్యాయవాది ఎంపి కొండయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు, అంగన్‌ వాడి యూనియన్‌ కార్యదర్శి రమాదేవి ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి. పవన్‌, ఎన్‌ పి ఆర్‌ డి నాయకులు లక్ష్మణ్‌, ఐద్వా పట్టణ కార్యదర్శ సుజాత, అధ్యక్షులు విజయలక్ష్మి, నాయకులు లక్ష్మీ, బులెమ్మ, పద్మ, కెవిపిస్‌ నాయకులు ఆనంద్‌ బెనర్జీ, శరత్‌ పాల్గొని ప్రసంగించారు.