తీర్మాన ప్రతులను దహనం చేస్తున్న ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు
ప్రజాశక్తి-పార్వతీపురం : బోయ, వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చవద్దని, అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన తీర్మానం వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన బుధవారం బెలగాంలో నిరసన చేపట్టారు. తీర్మానం కాపీని దహనం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం బోయ, వాల్మీకులను ఎస్‌టి జాబితాలో నిజమైన గిరిజనులు నష్టపోతారని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మండల లక్ష్మణరావు, కోలక అవినాష్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మండంగి రమణ, కడ్రక రామస్వామి, సీదరపు అప్పారావు, పువ్వల మోహనరావు, పువ్వల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.










