Nov 13,2023 19:30

టిడిపి మాజీ ఇన్‌ఛార్జీ గుడిసె ఆది కృష్ణమ్మ


ప్రజాశక్తి - ఆదోని
ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని టిడిపి మాజీ ఇన్‌ఛార్జీ గుడిసె ఆది కృష్ణమ్మ ప్రశ్నించారు. సోమవారం ఆమె ఆదోనిలో మాట్లాడారు. వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చినా జగన్‌ రెడ్డి స్పందించడం లేదన్నారు. దళితుల చిరకాల వాంఛ వర్గీకరణకు జగన్‌ అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. ఈ అంశంపై నాలుగున్నరేళ్లలో ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి స్పందించలేదన్నారు. సామాజిక న్యాయం టిడిపితోనే సాధ్యమన్నారు. మాదిగ, మాల కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి కూడా జగన్‌ ప్రభుత్వం కేటాయించలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్‌కు బుద్ధి చెప్పేందుకు ఎస్సీలు సిద్ధంగా ఉన్నారన్నారు.