Jul 07,2023 20:18

హోళగుందలో వేడుకలు నిర్వహిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లలో ఎబిసిడి వర్గీకరణ కోసం మందకష్ణ మాదిగ నాయకత్వంలో అలుపెరుగని పోరాటాలు చేస్తామని ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి జి.ఆనంద్‌ చైతన్య మాదిగ తెలిపారు. శుక్రవారం స్థానిక ఎంఆర్‌పిఎస్‌ కార్యాలయంలో ఎంఆర్‌పిఎస్‌ 29వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ముందుగా ఎంఆర్‌పిఎస్‌ జెండాను ఎగురవేసి, వర్గీకరణ ఉద్యమంలో అశువులు బాసిన వారి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారం చేపట్టిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చిన బిజెపి తొమ్మిదేళ్లు గడుస్తున్నా చేయకపోవడం సిగ్గుచేటన్నారు. జగన్‌ సర్కారు నాలుగేళ్లు అవుతున్నా వర్గీకరణ ఊసే ఎత్తకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఎంఆర్‌పిఎస్‌ నాయకులు కంబాలదిన్నె చిన్న రాముడు, హాలహర్వి గంధాలం ప్రభాకర్‌, గంధాలం ఏసేపు, భాస్కర్‌, బైలుప్పుల సురేంద్ర, వాసు, హాలహర్వి సురేష్‌, గాలెన్న, జయన్న, కంబాలదిన్నె రాజు, పొనకలదిన్నె ప్రదీప్‌, దినకర్‌, పెద్ద మర్రివీడు ప్రసాద్‌, గజేంద్ర పాల్గొన్నారు. హోళగుందలో ఎంఆర్‌పిఎస్‌ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంఆర్‌పిఎస్‌ మండల అధ్యక్షులు ఫక్కీరప్ప మాదిగ హాజరయి జెండాను ఎగురవేశారు. ఎంఆర్‌పిఎస్‌ నాయకులు బజారప్ప, ఉల్లిగప్ప, లక్ష్మన్న, రాముడు, హనుమంతు, విద్యా కమిటీ వైస్‌ ఛైర్మన్‌ హుస్సేని, జయప్ప, హుస్సేని, వాలంటీరు భీమప్ప, ఎంఎస్‌పి నాయకులు చిన్న ఉల్లిగప్ప, బుద్ధిరప్ప, తిమ్మప్ప, ఖాదరప్ప, సాలప్ప, వంకాయల హుస్సేనప్ప, కుంటి నరసప్ప, తాయప్ప, మీసాల షేకన్న పాల్గొన్నారు. ఆస్పరిలో ఎంఎస్‌పి, ఎంఆర్‌పిఎస్‌ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ముందుగా ఎంఆర్‌పిఎస్‌ దండోరా జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎంఎస్‌పి జిల్లా కోకన్వీనర్‌ సంజప్ప, మండల కన్వీనర్‌ రామాంజనేయులు, ఎంఆర్‌పిఎస్‌ మండల అధ్యక్షులు చిన్న సంజప్ప, డివిజన్‌ మాదిగ న్యాయవాదుల కన్వీనర్‌ మనోజ్‌ చేతుల మీదుగా మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సంద్భంగా కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచి, శుభాకాంక్షలు తెలిపారు.