Sep 29,2023 21:00

పోస్టు కార్డు ఉద్యమం చేపడుతున్న నాయకులు

ప్రజాశక్తి - మంత్రాలయం
ఎస్సీ వర్గీకరణ కోసం జైభీమ్‌ ఎంఆర్‌పిఎస్‌ ఆధ్వర్యంలో పోస్టు ఉద్యమం చేపట్టారు. శుక్రవారం జై భీమ్‌ ఎంఆర్‌పిఎస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జీ సంగటి యోహాను మాదిగ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం నుంచి రాఘవేంద్ర సర్కిల్‌ వరకు పోస్టు కార్డులు పట్టుకుని ర్యాలీ చేపట్టారు. పోస్టాఫీస్‌ దగ్గరికి వెళ్లి పోస్టు డబ్బాలో కార్డులు వేశారు. జై భీమ్‌ ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జడ రవిలు మాదిగలు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. జై భీమ్‌ ఎంఆర్‌పిఎస్‌ జిల్లా అధ్యక్షులు మత్తు సుమాల, జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జి హనుమన్న, జిల్లా కార్యదర్శి రత్నం మాదిగ, మంత్రాలయం నియోజకవర్గ నాయకులు డేవిడ్‌, మండల అధ్యక్షులు నరసింహులు, పెద్దకడబూరు మండల అధ్యక్షులు మంచోది ఆదాము, మండల ఇన్‌ఛార్జీ రవికుమార్‌, మండల ఉపాధ్యక్షులు బుజ్జి, మండల ప్రధాన కార్యదర్శి రాజకుమార్‌, కోసిగి మండల అధ్యక్షులు పందికోన రాజేష్‌, మండల ప్రధాన కార్యదర్శి పందికోన చిన్న ఈరన్న, మంత్రాలయం మండల కార్యదర్శి రచ్చమర్రి సంగటి సోమేష్‌, మండల నాయకులు బూదూరు ప్రభాకర్‌, మండల నాయకులు గర్జి రాజు, సూగూరు హనుమప్ప పాల్గొన్నారు.