Sep 22,2023 23:55

ప్రజాశక్తి - బాపట్ల
పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8 నుండి 22వరకు ఎంఆర్పిఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చివరి రోజు శుక్రవారంతో ముగిశయ ఎంఆర్‌పిఎస్‌ జిల్లా ఇన్చార్జి వర్ల దేవదాసు మాదిగ తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు బుడంగుంట్ల లక్ష్మీ నరసయ్య, పట్టణ కన్వీనర్ తాళ్లూరు రాజేష్, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ దుడ్డు వందనం, మండల ఇన్చార్జి మల్లవరపు గాంధీ, మాసిపోగు వేణు, వేమూరి నియోజకవర్గ ఇన్చార్జి దాసు, సాగర్, రాకేష్, చక్రవర్తి, ఏసు పాదం, నవీన్, సునీల్, మరియదాసు, దుడ్డు రాంబాబు, ఏసురత్నం, బాబు, మోషే, అమ్మి, మున్నా, రవీంద్ర, ఆంటోనీ, కిషోర్, అనిల్ పాల్గొన్నారు.