Dec 17,2022 00:00

మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి, చిత్రంలో జెసి, అడిషనల్‌ ఎస్‌పి

ప్రజాశక్తి-అనకాపల్లి
జిల్లాలోని ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు జరగకుండా నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నివారణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి నెల ఆఖరి శుక్రవారం మండల స్థాయిలో పౌరుహక్కుల దినోత్సవాలను నిర్వహిస్తూ బడుగు బలహీన వర్గాలకు వారి హక్కుల గురించి చైతన్య పరచాలని సూచించారు. అత్యాచార కేసుల్లో విచారణ వేగవంతం చేయాలన్నారు. అడిషనల్‌ ఎస్పీ విజయభాస్కర్‌ మాట్లాడుతూ అత్యాచారాలపై ఎవరికి ఎటువంటి సమాచారం తెలిసిన పోలీసులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో జెసి కల్పనా కుమారి. డిఆర్‌ఓ వెంకటరమణ, ఆర్డీవోలు చిన్ని కృష్ణ, జయరాం, పరవాడ అనకాపల్లి నర్సీపట్నం డిఎస్పీలు. డిపిఓ శిరీష రాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.