Oct 12,2023 00:18

ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ముందుంటుంది చిత్తూరు ఎంపి రెడ్డప్ప

ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ముందుంటుంది
చిత్తూరు ఎంపి రెడ్డప్ప
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
ఎస్‌సి, ఎస్‌టిల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని చిత్తూరు పార్లమెంట్‌ సభ్యులు ఎన్‌.రెడ్డెప్ప తెలిపారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ, సఫాయి కర్మచారిపై జిల్లా స్థాయి విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపి ముఖ్యఅతిథిగా విచ్చేయగా జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. వీరితో పాటు ఎస్‌పి వై.రిషాంత్‌ రెడ్డి, డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌, జిల్లా సాంఘీక సంక్షేమశాఖ అధికారి రాజ్యలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా చిత్తూరు ఎంపి ఎన్‌.రెడ్డప్ప మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టిల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని, వాలంటీర్‌, సచివాలయ వ్యవస్థ ద్వారా కుల, మత, రాజకీయ, ప్రాంతాలకతీతంగా రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి అర్హులకు వారి గడప వద్దకే సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టిల సమస్యలను తన దష్టికి తీసుకువస్తే అవసరమైతే జిల్లా కలెక్టర్‌, ఎస్‌పి, మంత్రులను సంప్రదించి పరిష్కారం చూపడం జరుగుతుందని తెలిపారు.కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీలో సభ్యులు తెలిపిన సమస్యలతో పాటు ఎస్‌సి, ఎస్‌టిల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కషి చేస్తున్నామన్నారు. గత సమావేశంలో సభ్యులు తెలిపిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లా ఎస్‌పి మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని, చట్టానికి లోబడి చర్యలుతీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దళితవాడల్లో శ్మశానవాటికల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇందులో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన శ్మశాన వాటికలకు దారి సమస్యల ఉందని దీనిని పరిష్కరించాలన్నారు. చిత్తూరు రూరల్‌ మండలం బంగారెడ్డిపల్లిలలో 80 ఎస్‌టి కుటుంబాలు ఉన్నాయని ఇది మొత్తం అటవీ ప్రాంతమని ఇక్కడకి వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే చిత్తూరు దర్గాసర్కిల్‌లో గల అంబేద్కర్‌ విగ్రహం వద్ద సుందరీకరణ చేయాలని, చిత్తూరు మున్సిపల్‌ పరిధిలో 49 డివిజన్‌లో గల శ్మశాన వాటికకు దారి ఏర్పాటు చేయాలని, మండల స్థాయిలో సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని, డివిజన్‌, మండల స్థాయిలో డివిఎంసి సమావేశాలు విధిగా నిర్వహించాలని, దీనితో పాటు సివిల్‌ రైట్స్‌ డే నిర్వహించాలని, వీటితో పాటు పలు సమస్యలను సభలో జిల్లా కలెక్టర్‌ సభ దష్టికి తీసుకుని రాగా సభలో తెలిపిన అంశాలపై పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సఫాయి కమీషన్‌ పర్యటనలో భాగంగా తెలిపిన అంశాల పై చర్యలు తీసుకున్నామని, మున్సిపల్‌ ఆఫీసులో పనిచేసే అవుట్‌ సోర్సింగ్‌ పారిశుద్ధ్య సిబ్బందికి మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించి పరీక్షలు నిర్వహించడం జరిగిందని, అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపట్టామని కలెక్టర్‌ తెలిపారు. ఈ సమావేశానికి డిఆర్డిఏ పిడి తులసి, పశు సంవర్థక శాఖ జెడి వెంకట్రావు, డిఎస్పిలు, చిత్తూరు, నగరి, పలమనేరు ఆర్డిఓలు రేణుక, సుజన, శివయ్య, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మూర్తి, మాదిగల అభివద్ధి సంక్షేమ సంఘం, చిత్తూరు పి.బాబు, ట్రైబల్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌, చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్‌ ఏ. దేవరాజులు, సుబ్రమణ్య సేవా సమితి, తవణంపల్లి మండలం సెక్రెటరీ ఎం.డేవిడ్‌, ఏపి అంబేద్కర్‌ యువజన సంఘం, చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్‌ వి.రాజ్‌ కుమార్‌ పాల్గొన్నారు.