కాంగ్రెస్ పార్టీ జల్లా అధ్యక్షురాలు లాం తాంతీయాకుమారి
ప్రజాశక్తి-కలెక్టరేట్(కృష్ణా)
ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక చట్టం - 2013 అమలు కొనసాగించాలని మరియు కాలపరిమితి పెంచాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కష్ణాజిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షురాలు ,లాము తంతీయా కుమారి సోమవారం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్టీ సబ్-ప్రణాళిక 10 సంవత్సరముల కాల పరిమితి 2023 మార్చితో ముగియనున్నదని, .కావున దీనిని మరో 10 సంవత్సరములు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సబ్-ప్లాన్ అమలు కొరకు ప్రత్యేక యత్రాంగాన్ని నియమించెలా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో అమలు చేస్తున్న 27 ఎస్సీ సంక్షేమ పధకాలను ప్రభుత్వం రద్దుచేయడం వల్ల రాష్ట్రంలో దళితుల అభివద్ది కుంటుపడిందని కాబట్టి వాటిని వెంటనే తిరిగి పునరుద్ధించాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో బందరు పట్టణధ్యక్షలు కొండమంచిలి చంద్ర శేఖర్. బందరు మాజీ ప్రెసిడెంట్ మొహ్మద్ దాదా, జిల్లా మైనారిటీ ఉపాధ్యాక్షలు మొహమ్మద్ ఫిరోజ్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ చానుభాషా తదితరులు పాల్గొన్నారు.










