దీక్ష చేస్తున్న ఎంఆర్‌పిఎస్ నాయకులు
ఎస్‌సి వర్గీకరణ కోసం రాజీలేని పోరాటం
ప్రజాశక్తి-నెల్లూరు :ఎస్‌సి వర్గీకరణ సాధన కోసం ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తామని ఎంఎస్‌పి ఎంఆర్‌పిఎస్ జిల్లా ఇన్‌ఛార్జి సూరిపాక వాసుదేవరావు మాదిగ పేర్కొన్నారు. ఎస్‌సి వర్గీకరణ సాధన కోసం ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈనెల18వ తేదీ నుంచి 22 తేదీ వరకు జరగబోవు అత్యవసర పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని, అందుకు ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో పాలక,ప్రతిపక్ష పార్టీలు ఎస్సీ వర్గీకరణ పై కషి చేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు సాగుతున్నాయి. నగరంలోని కలెక్టరేట్ ఎదుట చేస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎంఎస్‌పి ఎంఆర్‌పిఎస్ జిల్లా ఇన్చార్జీ సూరిపాక వాసుదేవరావు మాదిగ, ఎంఎస్‌పి జిల్లా కన్వీనర్ పందిటి అంబేద్కర్ మాదిగలు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అదేవిధంగా ప్రతిపక్షాలు ఎస్సీ వర్గీకరణ పై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజకీయ పార్టీల నుంచి స్పందన కానరాకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ పార్లమెంట్ సమావేశంలోనే వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని కోరుకునే ప్రతి మాదిగ,మాదిగ ఉపకులాల పెద్దలు దీక్షలకు తరలిరావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌పి జిల్లా కో కన్వీనర్ కోళ్లగట్ల రమేష్ మాదిగ, ఎంఆర్‌పిఎస్ జిల్లా కోకన్వీనర్ సూరిపాక ఉదరు కష్ణ మాదిగ,ఎంఎంఎస్ రాష్ట్ర నాయకురాలు గంగపట్ల లక్ష్మమ్మ మాదిగ,ఎంఎంఎస్ జిల్లా కో కన్వీనర్ మంద సుజాత మాదిగ,ఎంఆర్‌పిఎస్ జిల్లా కో కన్వీనర్ కె.చందు మాదిగ,గోచిపాతల రాఘవులు,టి మస్తాన్,ఎంఎస్‌ఎఫ్ నాయకులు. కె.నాని.ఇ.మహేష్, డి.వంశీ,శ్రీహరి,రాంబాబు,ఎన్ వెంకటరమణయ్య,మాదిగలు తదితరులు పాల్గొన్నారు.










