Sep 09,2023 16:30

ప్రజాశక్తి - చింతలపూడి
    ఈనెల 18న నిర్వహించే పార్లమెంటు సమావేశాల్లో ఎస్‌సి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని ఎంఎస్‌పి ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త, ఎంఆర్‌పిఎస్‌ జాతీయ నాయకురాలు చవటపల్లి విజయ మాదిగ తెలిపారు. పట్టణంలో స్థానిక ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌లో ఎంఆర్‌పిఎస్‌ జాతీయ అధ్యక్షులు పిలుపు మేరకు నిరసన కార్యక్రమం ఎంఎస్‌పి మహిళా కన్వీనర్‌ కొలికిపాము హైమావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. జనసేన, టిడిపి నాయకులు కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎస్‌పి ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త చౌటుపల్లి విజయ మాట్లాడుతూ ఎస్‌సి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి 59 ఉప కులాలకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఎంఆర్‌పిఎస్‌ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తలపెట్టిన 29 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమానికి ఎబిసిడి వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ఆమె కోరారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు వర్గీకరణ బిల్లుకు సంఘీభావం తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్‌ నియోజకవర్గ కన్వీనర్‌ జోసెఫ్‌ తంబి, ఎంఆర్‌పిఎస్‌ జాతీయ అధ్యక్షురాలు సొంగ నక్షత్రం, రాష్ట్ర నాయకురాలు నమ్మిన లక్ష్మి, జిల్లా ఇంఛార్జి నమ్మిన నాగార్జున, ఎంఆర్‌పిఎస్‌ చింతలపూడి నియోజకవర్గ మహిళా కన్వీనర్‌ గొల్లపల్లి సౌజన్య, కోకన్వీనర్‌ చౌటపల్లి అరుణ, ఎంఎస్‌పి జిల్లా నాయకురాలు జుజ్జువరపు మేరీ పాల్గొన్నారు.