Sep 21,2023 19:45

సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన

ఎస్‌సి వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలి
ప్రజాశక్తి వెలుగోడు :

ఎస్‌సి వర్గీకరణ బిల్లు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశాల పెట్టాలని ఎంఆర్‌పిఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు ఏడవ రోజుకు చేరాయి. గురువారం వెలుగోడు మండలం బేడ బుడగ జంగాల అధ్యక్షులు చిత్తారి మల్లికార్జున ఆధ్వర్యంలో బుడగ జంగాల సంఘం పెద్దలు, విద్యార్థులు దీక్షలకు సంఘీభావం తెలిపారు. అదేవిధంగా వి హెచ్‌ పి ఎస్‌ మండల నాయకులు రావుఫ్‌, వికలాంగులు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మద్దతు ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయకపోతే రాబోయే ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్తామని ఎం ఎస్‌ పి జిల్లా కార్యదర్శి వాదం నాగ శేషులు, బేడ బుడగ జంగాల అధ్యక్షులు చిత్తారి మల్లికార్జున, విహెచ్‌పిఎస్‌ మండల అధ్యక్షులు రావుఫ్‌ తదితరులు పేర్కొన్నారు.
సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన
బండి ఆత్మకూర్‌ : ఎస్సీ వర్గీకరణను సాధించడం కోసం ప్రాణ త్యాగాల కైనా సిద్ధమనిమాదిగ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ నేతలు పేర్కొన్నారు. మాదిగ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ జిల్లా అధికార ప్రతినిధి పూల విజరు కుమార్‌, సురేష్‌, పూల మార్టిన్‌, నలుగురు ఎమ్మెస్‌ఎఫ్‌ విద్యార్థులు ఎర్రగుంట్ల గ్రామంలో షెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలియజేశారు. ఎస్‌ఐ మల్లికార్జున ఆధ్వర్యంలో పోలీసులు ఎంఎస్‌ఎఫ్‌ కార్యకర్తలను నాయకులను సెల్‌ టవర్‌ నుండి దిగాలని కోరడంతో ఎంఎస్‌ఎఫ్‌ నాయకులు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి పూల వెంకట సుబ్బన్న మాట్లాడుతూ ఎంఆర్‌పిఎస్‌ నేతలను అక్రమ అరెస్టులను చేయడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో శివకుమార్‌, ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.