మాట్లాడుతున్న ఎంఆర్‌పిఎస్ నాయకులు
ఎస్‌సి వర్గీకరణ బిల్లు పెట్టాలి...
ప్రజాశక్తి-నెల్లూరు :ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకులు మందకష్ణ మాదిగ ఆదేశాల మేరకు భవిష్యత్తు కార్యచరణలో భాగంగా......ఎంఆర్‌పిఎస్ ఆధ్వర్యంలో సోమవారం బిఆర్ అంబేద్కర్ భవన ంలో విలేకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నెల్లూరు జిల్లా ఇన్‌ఛార్జి సూరిపాక వాసుదేవరావు మాదిగ మాట్లా డుతూ పార్లమెంట్ సమావేశంలోనే ఎస్‌సి వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని....మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు వర్గీకరణ చేయకుండా మాదిగలను నమ్మించి మోసం చేస్తుందని మండి పడ్డారు అదేవిధంగా ప్రతి పక్షంలోని కాంగ్రెస్ పార్టీ తక్షణమే వర్గీకరణ పై తమ వాణి వినిపించాలని రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అధికార ప్రతి పక్ష పార్టీలు తక్షణమే వర్గీకరణ పై స్పందించాలన్నారు. లేదంటే మాదిగల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. ఎంఆర్‌పిఎస్ జిల్లా కన్వీనర్‌గా గోసాల సుధాకర్, మాదిగ జిల్లా కో కన్వీనర్‌గా సూరిపాక ఉదరు కష్ణ మాదిగ, జిల్లా కో కన్వీనర్‌గా తాటిపర్తి లక్ష్మయ్య మాదిగ, కో కన్వీనర్‌గా నక్కిబోయిన గంగాధర్ మాదిగ, కోళ్లగట్ల చందు మాదిగలను ఎన్నుకున్నారు










