
రాజంపేట అర్బన్ : ఓబులవారిపల్లి మండలంలోని బాలిరెడ్డిపల్లి పంచాయతీలో గల నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు సాగుభూమి మంజూరు చేయాలని సిపిఎం ఓబుల వారిపల్లె మండల కార్యదర్శి చింతలపూరి నాగమ్మ ఆధ్వర్యంలో బుధవారం ఆదివారం రామకృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సి.రవికుమార్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేష్, రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.జయరాం పాల్గొ న్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలిరెడ్డిపల్లి పంచాయతీలోని ఎస్సీ ఎస్టీల అనుభవంలో ఉన్న సర్వేనెంబర్ 1155 లో 220 ఎకరాలు భూమిని ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలని కోరుతూ గత 15 సంవత్సరాల నుండి తహశీ ల్దార్, ఆర్డీవో కర్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయామన్నారు. ఆ సర్వే నెంబర్లు కొందరు దొంగ ఆన్లైన్ చేసుకుని లక్షల రూపాయలు బ్యాంకుల్లో రుణాలు పొందారని, దొంగ ఆన్లైన్‌లను వెంటనే రద్దు చేసి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టి ఎనిమిదవ విడత భూ పంపిణీ కార్యక్రమంలో బాలిరెడ్డిపల్లె ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీ చేయాలని., లేనిపక్షంలో పిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముట్టడించి న్యాయం జరిగేవరకు కార్యాలయంలోనే వంట-వార్పు చేపడుతామని హెచ్చరించారు. వెంటనే స్పందించిన ఆర్డీవో రామకృష్ణారెడ్డి విచారణ చేపట్టి న్యాయం చేస్తామని తెలిపారన్నారు. కార్యక్ర మంలో మహిళా సమాఖ్య రైల్వేకోడూరు నియోజకవర్గ కార్యదర్శి కృష్ణవేణి, పెనగలూరు మండల కార్యదర్శి ఆదినారాయణ, సిబిఐ నాయకులు బీదం రాజశేఖర్, సిపిఎం నాయకులు రమణ, మణి, లక్ష్మయ్య రవి పాల్గొన్నారు.