ప్రజాశక్తి-తిరువూరు
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టానికి కాల పరిమితిని పొడిగించి దళిత గిరిజను ల అభివద్ధికి నిధులు కెటాయించాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి జి.నటరా జు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కాలపరిమి తి ఆంధ్రప్రదేశ్ లో జనవరి 24 తో 10 సంవత్సరాల కాలపరిమితి పూర్తవు తున్నందున ప్రభుత్వం ఈచట్టాన్ని పొడిగిస్తూ ఆర్డినెస్ తీసుకురావాలని కుల వివక్ష వ్యతిరే పోరాట సంఘం (కెవిపిఎస్) ఆధ్వర్యంలో వివిధ, రాజ కీయ పార్టీల, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తిరువూరు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మరుసకట్ల ప్రభాకర రావు అధ్యక్షతన ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈసంద ర్భంగా నటరాజు మాట్లాడుతూ సిపిఎం, ఇతర వామపక్షాలతో పాటు కెవిపిఎస్, 135 ప్రజా సంఘాల చారి త్రాత్మక పోరాట ఫలితంగా ఏర్పడిన సబ్ ప్లాన్ చట్టం జనాభా నిష్పత్తి ప్రకా రం ఎస్సీ, ఎస్టీ తరగతులకు నిధులు కేటాయించి ఖర్చు పెట్టేందుకు ఏర్ప డిందన్నారు. సబ్ ప్లాన్ చట్టాన్ని పొడిగిస్తూ ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటుచేసి చట్టాన్ని నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఈచట్టం ఏర్పాట్లు అలసత్వం ఏమాత్రం తగదని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సిపిఎం పట్టణ కార్య దర్శి ఎం.నాగేంద్ర ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు ఉయ్యురు జయ ప్రకాష్, టిడిపి నాయకులు వాసం మునియ్య, బిఎస్పీ నాయకులు జి దేవా, మల్లాది అశోక్, వి. మల్లయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు ఎం.గోపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బి.రాము, హ్యూమన్ రైట్స్ కమిటీ నాయకులు జి.ఆదాం తదితరులు ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. 26వ తేదీన కెవిపిఎ స్, దళిత, ఉద్యోగ, ప్రజా సంఘాలు ఉమ్మడిగా అబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన, అర్జీలు స మర్పించాలని పిలు పిచ్చారు. ఈకార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కామాల రామా రావు, డప్పకళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి ఎం. కుటుంబరావు, చింత య్య, సిఐటియు నాయుకుడు ఎస్ వి భద్రం, బి.వెంకటేశ్వరరావు, ఆకుల రవి, కామాల రామారావు నాగరాజు,యం ఇస్రాయేల్ తదితరులు పాల్గొన్నారు.










