Oct 16,2023 17:15

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన సీఐ జి.ప్రకాష్ కుమార్


 ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన సీఐ
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్

      నందికొట్కూరు టౌన్ పోలీసు స్టేషన్  ఇన్స్పెక్టర్ గా బాధ్యత లు స్వీకరించిన జి. ప్రకాష్ కుమార్ జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. జి .ప్రకాష్ కుమార్  తిరుపతి జిల్లాలో బాక్రపేట పోలీసు స్టేషన్ సబ్- ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో పదోన్నతి పొంది తిరుపతి వి ఆర్ నుండి నంద్యాల జిల్లా నందికొట్కూరు టౌన్ పోలీసు స్టేషన్ కు  ఇన్స్పెక్టర్ గా బదిలీ అయ్యారు.సోమవారం నందికొట్కూరు పోలీసు స్టేషన్ నందు ఇన్స్పెక్టర్ గా భాద్యతలు స్వీకరించిన అనంతరం నంద్యాల జిల్లా ఎస్పీ కె .రఘువీర్ రెడ్డిని జిల్లా పోలీసు కార్యాలయం నందు పుష్పగుచ్చంతో మర్యాదపూర్వకంగా కలిశారు.