ఎస్‌పీఎంవీవీ ని క్లైమేట్ హబ్‌గా మార్చండి
ప్రజాశక్తి-క్యాంపస్: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాల యం మొట్టమొదటి క్లైమేట్ హబ్‌గా తయారు చేసేందుకు అవకాశా లు ఉన్నాయని వాషింగ్టన్ డాక్టర్ మహిళా విశ్వవిద్యాలయంలో పర్యా వరణం, సమాజ సుస్థిరత అంశంపై కార్యశాలను నిర్వహించారు. వైస్ ఛాన్సలర్ ప్రొ.డి.భారతి క్లైమేట్ యాక్షన్‌పై సంక్షిప్త నివేదికను అందజేసి, 2050 నాటికి నికర జీరోను సెట్ చేస్తామని, జాతీయ సోలార్ మిషన్, వాటర్ మిషన్ వాతావరణ చర్యలలో కీలకమైనవని ఆమె వివరించారు. ఎస్‌పిఎంవివి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్.రజిని పర్యావరణం స్నేహపూర్వక చొరవ అని చెప్పారు. విశ్వవిద్యాలయం లో అమలు చేయడం, అలాంటి చర్యల కారణంగా తాము న్యాక్- ఎం పొందామన్నారు. మాజీ రిజిస్ట్రార్, కార్బన్ న్యూట్రాలిటీ కోఆర్డి నేటర్ ప్రొఫెసర్ డి.ఎమ్.మమత, డాక్టర్.బార్ట్ ఫిషర్ గురించి పరిచయం చేశారు. వాక్సన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఇందిరా దాస్ అసోసియేట్ ప్రొఫెసర్ సుస్థిరతపై ప్రసంగిం చారు. వైస్ ఛాన్సలర్, గౌరవ అతిథి, క్రెస్ట్ టీమ్ ని సత్కరించారు. కార్యక్రమంలో డీన్స్, హెచ్‌వోడీలు, మాజీ డీన్‌లు, ఫ్యాకల్టీ తదితరులు పాల్గొన్నారు.










