
ప్రజశక్తి - చీరాల
బాపట్ల జిల్లా ఎస్పీ, ఒంగోలు జిల్లాలకు నేషనల్ పోలీస్ అవార్డు అందుకోవటం హర్షనీయమని డిఎస్పి ప్రసాదరావు అన్నారు. స్థానిక డి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీకి అవార్డు రావడం పట్ల అనందాన్ని వ్యక్తం చేస్తూ సామాజిక కార్యకర్త తేళ్ళ రాంబాబు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్బంగా డిఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బాపట్ల జిల్లాకు దేశంలోనే గుర్తింపు తీసుకురావటం ఎంతో గర్వకారణం అన్నారు. విధి నిర్వహణలో జిల్లా ఎస్పీ వాకుల్ జిందాల్‌కు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు రావటం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్నో అవార్డులు అందుకుని ఉన్నత ఉద్యోగ బాధ్యతలు స్వికరించాలనిఆకాంక్షించారు. కార్యక్రమంలో టూ టౌన్ సిఐ సోమశేఖర్, ఈపురపాలెం ఎస్సై జనార్ధన్, వేటపాలెం ఎస్సై సురేష్, ఒకటవ పట్టణ ఎస్సై జానీ భాష, జెఎసి నాయకులు మార్క్ పాల్గొన్నారు.