పార్వతీపురంరూరల్: భారత మాజీ ఉప ప్రధాని సర్ధార్ వల్లభారు పటేల్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం దేశ సమైక్యత, సమగ్రతలకు అంకితభావంతో పాటుపడదామని రిజర్వు ఇన్స్పెక్టర్ కుమార్ అధికారులు, సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణ నుండి రన్ ఫర్ యూనిటీ ( 2కెరన్) ను ప్రారంభించారు. ఈ 2కె రన్ పోలీస్ కార్యాలయం నుండి వైకెఎంనగర్ జంక్షన్, కోర్టు రోడ్డు మీదుగా ఆర్‌టిసి కాంప్లెక్స్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో పట్టణ సిఐ కృష్ణారావు, రిజర్వు ఇన్స్పెక్టర్లు కుమార్, శ్రీనివాసరావు, పట్టణ ఎస్‌ఐ దినకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వీరఘట్టం: మండలంలో జాతీయ సమైక్యత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఎంవి పురంలో ఎంఇఒ ఆర్.ఆనందరావు విద్యార్థులచే గ్రామంలో ర్యాలీ నిర్వహించి అనంతర ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం తోపాటు సీఆర్పీలు జగదీష్, జ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు.
పాలకొండ : జాతీయ సమైక్యత దినోత్సవం, సర్దార్ వల్లభారు పటేల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక జూనియర్ కళాశాల (బాలురు)లో జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల అధ్యక్షులు పైల శంకరరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి వెలమల అప్పారావు, సీనియర్ అధ్యాపకులు తేజేశ్వరరావు, గోవిందరావు, శివానంద వెంకటేశ్వరరావు, నారాయణరావు, విజయరాజ్, చంద్రరావు, గిరిబాబు, ఫిజికల్ డైరెక్టర్ నాగభూషణరావు పాల్గొన్నారు.
సాలూరు రూరల్ : స్థానిక ఎంపిడిఒ గొల్లపల్లి పార్వతి ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతాదినోత్సవం, 3కే రన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు .
సాలూరు: జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా మంగళవారం అంగన్వాడీ కార్యకర్తలు జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. ఐసిడిఎస్ సూపర్ వైజర్ తిరుపతమ్మ ఆధ్వర్యాన కార్యకర్తలు రెవెన్యూ కార్యాలయం జంక్షన్‌లో మానవహారం చేపట్టారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు నాయకులు బి.రాధ ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని శ్రీ వెంకట విద్యాగిరి పాఠశాలలో విద్యార్ధులు పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పాఠశాల కరస్పాండెంట్ కోడూరు సాయి శ్రీనివాసరావు ఆధ్వర్యాన ఉపాధ్యాయులు, విద్యార్ధులు పటేల్‌కు నివాళి అర్పించారు.
సీతంపేట: స్థానిక గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మంగళవారం జాతీయ ఐక్యత దినోత్సవం సర్ధార్ వల్లభారు పటేల్ జయంతిని రాష్ట్రీయ ఏక్తా దివస్‌గా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఐటిడిఎ డిప్యూటీ డిఇఒ లిల్లీరాణి హాజరయ్యారు. పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తితో యువత ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. వల్లభారు పటేల్ గురించి వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










