
పార్వతీపురంరూరల్: రాష్ట్ర పోలీసు శాఖ ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఆధర్యంలో మంగళగిరి సిటిసి శిక్షణ కేంద్రంలో తొమ్మిది నెలల శిక్షణ అనంతరం పార్వతీపురం మన్యం జిల్లాకు కేటాయించిన నార్కోటిక్స్ ట్రాకింగ్ డాగ్ 'మ్యాక్స్' గురువారం జిల్లా ఎస్‌పి కార్యాలయానికి చేరుకుంది. డాగ్ సంరక్షకులు జిల్లా ఎస్‌పి విక్రాంత్ పాటిల్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్‌పి మ్యాక్స్‌కి స్వాగతం పలికి తొమ్మిది నెలల శిక్షణ తీరును, 'మాక్స్' ఆరోగ్యం, శిక్షణ నైపుణ్యంను అడిగి తెలుసుకున్నారు. శిక్షణలో జిల్లాకు చెందిన డాగ్ హ్యాండ్లర్ కె.రామారావు స్పేర్ హ్యాండ్లర్ వి.బలరాంలను డాగ్ 'మాక్స్' ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, క్రమానుగుణంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్‌పి డాక్టర్ ఒ.దిలీప్ కిరణ్, రిజర్వు సిఐ కుమార్ పాల్గొన్నారు.