Aug 07,2023 21:11

ఫిర్యాదులను స్వీకరిస్తున్న ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌

పార్వతీపురం రూరల్‌: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ''స్పందన'' కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, దిశా డిఎస్పీ ఎస్‌ఆర్‌సి హర్షిత జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌బి సిఐ సిహెచ్‌.లక్ష్మణరావు, డిసిఆర్‌బి సిఐ ఎన్‌వి ప్రభాకరరావు, ఎస్‌ఐ పాపారావు, దిశా ఎస్‌ఐ లావణ్య పాల్గొన్నారు.