Sep 08,2023 21:55

ఎస్‌పిని సన్మానిస్తున్న మేయర్‌, జడ్‌పి చైర్మన్‌

కడప : జిల్లా ఎస్‌పిగా పనిచేసి అనంతపురం జిల్లాకు బదిలీ అయిన సంద ర్భంగా అన్బురాజన్‌ను జిల్లా ఎస్‌పి కార్యాలయంలో శుక్రవారం వైసిపి జిల్లా అధ్యక్షులు, నగర మేయర్‌ సురేష్‌ బాబు, జడ్‌పి చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాధరెడ్డి ఉద్యాన శాఖ చైర్మన్‌ సాంబటూరు ప్రసాద్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి, పూల బొకే అందజేసి వీడ్కోలు పలికారు. వీరితోపాటు వైసిపి నాయకులు మల్లికార్జున, కిరణ్‌, కోలా కొండయ్య ఉన్నారు.