ఎస్‌జిఎఫ్ ఏపీ క్రీడల పోటీలు
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : పట్టణంలోని స్థానిక ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్‌జిఎఫ్ ఏపీ నగరి నియోజకవర్గ స్థాయి అండర్ 14 , అండర్ 17 బాల బాలికలకు యోగా, కోకో, అథ్లెటిక్స్ క్రీడల పోటీలు మంగళ వారం నిర్వహించారు. పుత్తూరు, నిండ్ర, వడ మాలపేట, నగరి, విజయపురం మండలాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారు లు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు సునీత అధ్యక్షత నిర్వహించారు. హాజరైన పుత్తూరు మండల విద్యాశాఖ అధికారులు తిరుమల రాజు , బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ క్రీడా కారులకు కొన్ని సూచన ప్రాయంగా మంచి క్రమశిక్షణ ఉంటే జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకోవచ్చన్నారు. క్రీడాకారులకు చదువు, క్రీడలు రెండు కళ్లు లాంటిదని నగరి నియోజకవర్గానికి రాష్ట్రస్థాయి గుర్తింపు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి వి సురేష్ బాబు, తిరుపతి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎస్ బాబు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎన్ మణి, మండల కో ఆర్డినేటర్లు సిఎస్ నందకుమార్, గుర్రప్ప, సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్ రాజు, చెన్నకేశవులు పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా నాగేంద్ర, కేశవులు, మోహన్ బాబు, లక్ష్మీపతి, అరుణ, సునీత, స్వప్న, కవిత, గౌరీ సాని, గీతమ్మ, పాండ్యా, శంషుద్దీన్, సి.కె బాబు, సతీష్, గోప,ి గంగరాజు పాల్గొన్నారు.










