ప్రజాశక్తి-మంగళగిరి : షార్జాలో యూఎఇ వేదికగా మొట్టమొదటి ఏషియన్ యూనివర్సిటీస్ పవర్ లిఫ్టింగ్ కప్ పోటీలు ఈనెల 16వ తేదీ నుండి జరుగుతున్నాయి. ఈ పోటీల్లో మంగళగిరి పట్టణానికి చెందిన ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిని షేక్ సాదియా ఆల్మాస్ మరోసారి సత్తా చాటారు. ఆల్మాస్ నాలుగు బంగారు పతకాలు సాధించినట్లు కోచ్ షేక్ సంధాని ఆదివారం తెలిపారు. స్ట్రాంగ్ ఉమెన్ మెడల్ కూడా సాధించారన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి పాల్గొని ఈ పథకాలు సాధించినట్లుగా సందాని తెలిపారు. సాదియా ఆల్మాస్‌ను సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఎం.ప్రభాకర్, కార్యదర్శి ఎస్.సూర్యనారాయణ, గౌరవాధ్యక్షులు జి.వెంకటేశ్వరావు, నేషనల్ పవర్ లిఫ్టర్ బి.ప్రసాద్ అభినందించారు.










