Jul 11,2023 23:44

పట్టుబడిన అధికారి సయ్యద్‌ లయిక్‌

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : మంగళగిరి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌ సయ్యద్‌ లయిక్‌ అహ్మద్‌ రూ.16 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గుంటూరు జిల్లా అరుంధతి నగర్‌ చెందిన పి.నరేంద్రబాబు భార్య ఎఎన్‌ఎంగా పని చేస్తున్నారు. ఆమెకు అంతర్‌ జిల్లాల పరస్పర బదిలీ దరఖాస్తును ప్రొసెస్‌ చేయడానికి అహ్మద్‌ రూ.40 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో వారు ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారుల సూచనల మేరకు ఎఎన్‌ఎం భర్త నరేంద్ర మంగళశారం రూ.16 వేలను అహ్మద్‌కు ఇస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడ్ని కోర్టులో హాజరు పర్చనున్నట్టు డిజిపి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.