Oct 07,2023 21:08

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహశీల్దార్‌, విఆర్‌ఒ

కమలాపురం : కమలాపురం నియోజకవర్గంలోని వీర పునాయునిపల్లె మండలం రెవెన్యూ కార్యాలయంపై ఎసిబి అధికారులు శని వారం దాడులు నిర్వహి ంచారు. ఈ దాడులలో రూ.30 వేలు లంచం తీసు కుంటూ డిప్యూటీ తహశీల్దార్‌ శ్రీకాంత్‌రెడ్డి, విఆర్‌ఒ మునికృష్ణ పటు ్టబడ్డారు. ఈ సందర్భంగా ఎసిబి ఎఎస్‌పి దేవిప్రసాద్‌ విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని వెల్దుర్తిలో శేఖర్‌ అనే రైతు ఆరు ఎకరాల పొలం చుక్కల భూమిని ఆన్‌లైన్‌ ఎక్కించుకోవడానికి 2012 సంవత్సరం నుండి తహశీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడని పేర్కొన్నారు. ఎంత తిరిగినా ప్రయోజనం లేక రైతు అధికారులను గట్టిగా అడిగారని తెలిపారు. భూమి ఆన్‌లైన్‌ చేయాలంటే ఖర్చుతో కూడుకుందని తెలిపారని చెప్పారు. ఇందు కోసం రూ.50 వేలు అవుతుందని రెవెన్యూ అధికారులు రైతుకు చెప్పారని పేర్కొన్నారు. రైతు శేఖర్‌ చేసేదేమీ లేక తమను సంప్రదించారన్నారు. లంచం అడుగుతున్నారని ముందస్తు సమాచారం ఇచ్చారని చెప్పారు. తహశీల్దార్‌ కార్యాలయంలో సిఐలు అలీ, శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ నరేష్‌, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహిం చామన్నారు. డిప్యూటీ తహశీల్దార్‌, విఆర్‌ఒ లంచం తీసు కుంటుండగా పట్టుకున్నామని తెలిపారు. వారివురిపై కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఎవరైనా అధికారులు లంచం అడిగితే ఎసిబిని సంప్రదించాలన్నారు. 14400 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.