Oct 20,2023 21:56

ఖాళీ ప్లేట్లు, తపాలాలతో నిరసన తెలుపుతున్న ఎస్‌ఎస్‌ఎ ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులు

ప్రజాశక్తి - సీతంపేట :  పెండింగ్‌లో ఉన్న మూడునెలల జీతాలు తక్షణమే చెల్లించి తమను ఆదుకోవాలని సర్వశిక్ష అభియాన్‌ ఔట్‌సోర్సింగ్‌ గాంధీ విగ్రహం వద్ద ఖాళీ ప్లేట్లుతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీతాలు చెల్లించకుండా పండగపూట పస్తులతో ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మూడు నెలలుగా నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో పస్తులతో కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. తక్షణమే తమకువేతనాలు చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు నిమ్మక శ్రీనివాస్‌, బిడ్డిక దవళేశ్వరరావు, నిమ్మక సుజాత, పి.హేమలత, బి.వసంతరావు, టి.నిరంజన్‌, ఎ.ప్రకాష్‌, ఎ. రాములు, ఎస్‌.రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.