Jan 28,2023 23:00

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌ 

భారత విద్యార్థి ఫెడరేషన్‌ ( ఎస్‌ఎఫ్‌ఐ) - యునైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ( యుటిఎఫ్‌ ) సంయుక్తంగా పదవ తరగతి విద్యార్థులకు మోడల్‌ పరీక్షను నిర్వహించనున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సి.హెచ్‌. వెంకటేశ్వరరావు, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసరావు తెలిపారు. మోడల్‌ పరీక్షకు సంబంధిం చిన పోస్టర్‌ను శనివారం సాయంత్రం నగరంలోని బాలోత్సవ్‌ భవన్‌లో ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలంటే భయం పొగొట్టడానికి ప్రజ్ఞా వికాసం పేరుతో మోడల్‌ పరీక్షను ఫిబ్రపవరి 20వ తేదీన నిర్వహించ నున్నట్లు తెలిపారు. పరీక్ష మద్యాహ్నం 2 గంటల నుండి 3.30 గంటల వరకు జరుగుతుం దన్నారు. కృష్ణా. గుంటూరు గ్రాడ్యుయేట్‌ శాసన మండలి సభ్యులు కె.యస్‌.లక్ష్మణరావు పర్యవేక్షణలో పరీక్ష జరుగు తుందన్నారు. పరీక్ష పదవ తరగతి సిలబస్‌ నుండి 100 మార్కులకు ఉంటుందన్నారు. ఈపరీక్ష తెలుగు, ఇంగ్లీషు మీడియంలలో ఉంటుందని తెలిపారు. సబ్జెక్టుల వారీగా చూస్తే లెక్కలు 20, ఎన్‌ఎస్‌ 10, పిఎస్‌ 10, ఇంగ్లీషు 20, తెలుగు 10, హిందీ 1-0, సోషల్‌ 20 మార్కులకు ఉంటుందన్నారు. పరీక్ష జంబ్లింగ్‌ పద్దతిలో ఓఎంఆర్‌ షీట్‌ జవాబు పత్రం ఉంటుందన్నారు. యుటిఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఎన్‌టిఆర్‌ జిల్లా కమిటీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని విద్యార్థులు పరీక్షకు హాజరవ్వా ల్సిందిగా కోరారు. వివరాలకు 9010 849 524 ఫోన్‌ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎం.సోమేశ్వరరావు, యుటిఎఫ్‌ ఎన్‌టిఆర్‌ జిల్లా ప్రదాన కార్యదర్శి ఏ.సుందరయ్య, జిల్లా కోశాధికారి మహేశ్వర వెంకటేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు షైనీ,కుమార స్వామి పాల్గొన్నారు.