ప్రజాశక్తి - భట్టిప్రోలు
ఎస్ఎఫ్ఐ మండల నూతన కమిటీని 12మంది సభ్యులతో శుక్రవారం ఎంపిక చేశారు. మండల అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్‌కె మొహిద్దిన్, కె జగదీష్ ఎంపికైనట్లు బాపట్ల జిల్లా అధ్యక్షులు పి మనోజ్ తెలిపారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ ఎంతో చారిత్రాత్మకం కలిగిన భట్టిప్రోలులో ప్రభుత్వ పాఠశాల, కాళశాల లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఉన్నటువంటి ఎయిడెడ్ జూనియర్, డిగ్రీ కళాశాలలు మూతపడ్డాయని తెలిపారు. దీంతో పేద విద్యార్థులకు ప్రభుత్వ చదువు దూరమైందన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎదుర్కునే సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిరంతర పోరాటం చేస్తుందన్నారు. సభ్యులుగా సంజీవ్, కృష్ణ, మనోహర్, శ్రీనివాస్సత్య, అజయ్ ఎంపికయ్యారు.










