పి.పద్మ, ఎస్.కె.సమీర్
ప్రజాశక్తి-గుంటూరు : ఎస్‌ఎఫ్‌ఐ గుంటూరు నగర నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా పి.పద్మ, ఎస్.కె.సమీర్ ఎన్నికయ్యారు. ఎస్‌ఎఫ్‌ఐ నగర మహాసభ స్థానిక బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ మహాసభలో 14 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా చందు సుచరిత, వంశీ, సహాయ కార్యదర్శులుగా కార్తీక్, మహేంద్ర ఎన్నికయ్యారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్ మాట్లాడుతూ విద్యా ప్రైవేటీకరణ, కాషాయీకరణను ప్రోత్సహించే విధంగా ఉన్న నూతన జాతీయ విద్యావిధానంపై పోరాటాలకు విద్యార్థులు సిద్ధ: కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సుధీర్, రూపస్, సుచరిత, చందు, బాల పాల్గొన్నారు.










